Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పాక్‌ జైళ్లలో 577 మంది జాలర్లు: కేంద్రం

న్యూదిల్లీ: పాకిస్థాన్‌ జైళ్లలో 577 మంది భారత జాలర్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. మన జాలర్లను అదుపులోకి తీసుకోవడం, చేపలు పట్టే పడవల స్వాధీనంపై అనేకసార్లు పాక్‌ వద్ద అభ్యంతరాలు వ్యక్తం చేశామని తెలిపింది. 2008 మే 21న భారత్‌, పాక్‌ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం రెండు దేశాలు ఆ దేశాల అదుపులో గల పౌర ఖైదీలు, జాలర్ల జాబితాలను యేటా జనవరి 1వ తేదీన, జులై 1వ తేదీన ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉందని కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ చెప్పారు. 2022 జనవరి 1న మార్చుకున్న జాబితా ప్రకారం భారతీయులు లేదా భారతీయులుగా భావిస్తున్న 577 మంది తమ అదుపులో ఉన్నట్లు పాకిస్థాన్‌ వెల్లడిరచిందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మంత్రి చెప్పడంతో పాటు ప్రభుత్వ రికార్డుల ప్రకారం 1164 చేపలు పట్టే పడవలు పాకిస్థాన్‌ అదుపులో ఉన్నాయి. అయితే, పాకిస్థాన్‌ మాత్రం పడవల గురించి తమ వద్ద సమాచారం లేదని చెబుతోంది. పాక్‌ అదుపులో ఉన్న జాలర్లు, పడవల గురించి పదేపదే ఆ దేశం వద్ద ప్రస్తావిస్తున్నామని, తమ అభ్యంతరాలు తెలుపుతున్నామని మంత్రి మురళీధరన్‌ తెలిపారు. పాక్‌ జైళ్ల నుంచి భారత జాలర్లను విడిపించడానికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తున్నామన్నారు. మత్స్యకారుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img