Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పారాబాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు

రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసి నిరసన
న్యూదిల్లీ : ఈ రబీ సీజన్‌లో పారాబాయిల్డ్‌ రైస్‌ కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఎంపీలు శుక్రవారం రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు. దీనిపై ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కే కేశవరావు నేతృత్వంలోని నలుగురు ఎంపీలు సభనుంచి వాకౌట్‌ చేశారు. అంతకుముందు ఉదయం సెషన్‌లో రాష్ట్రానికి చెందిన వ్యవసాయ సంబంధ సమస్యలపై ముగ్గురు టీఆర్‌ఎస్‌ సభ్యులు వెల్‌ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. చైర్మన్‌ ఎం వెంకయ్య నాయుడు వారిని తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరడంతో వారు తిరిగి తమ స్థానాల్లో కూర్చున్నారు. తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడుతూ.. తెలంగాణ నుంచి మొత్తం ధాన్యాన్ని సేకరించేందుకు కేంద్రం సుముఖంగా ఉందా లేదా అని ప్రశ్నించారు. అది ఎటువంటి ధాన్యమైనా సేకరించాలన్నారు. తెలంగాణ నుంచి ప్రతి గింజను కొంటామని ఓ కేంద్ర మంత్రి చెప్పారని, ఆ ప్రకటనకు కేంద్రం కట్టుబడి ఉందా లేదా అని నిలదీశారు. ఇందుకు సంబంధించి ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను కూడా ప్రదర్శించారు. గత ఏడాది 94 లక్షల టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొన్నదని, కానీ ఈ ఏడాది కేవలం 19 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్లు కేశవరావు తెలిపారు. గత ఏడాది తీసుకున్నంత ఈ ఏడాది తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 60 శాతం పెరిగిందన్నారు. దీనిపై మంత్రి పీయూష్‌ గోయల్‌ సమాధానం ఇచ్చారు. ప్రతి ఏడాది పంట సేకరణను క్రమంగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణను పెంచామని, తెలంగాణలోనూ ప్రొక్యూర్మెంట్‌ను పెంచినట్లు వెల్లడిరచారు. తెలంగాణలో ఖరీఫ్‌ సీజన్‌లో 50 లక్షల టన్నులు ఇస్తామని చెప్పారని, కానీ కేవలం 32.66 లక్షల టన్నులు మాత్రమే ఇచ్చారన్నారు. రబీ సీజన్‌లో ఎక్కువగా బాయిల్డ్‌ రైస్‌ ఉంటుందని, ఒకవేళ మీరు బాయిల్డ్‌ రైస్‌ ప్రొక్యూర్‌ చేస్తే, ఎంత చేస్తారో చెప్పాలని కేశవరావు ప్రశ్నించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. పెండిరగ్‌లో ఉన్న ధాన్యాన్ని సరఫరా చేయాలని అన్నారు. దిగడానికి కారణం రబీ సీజన్‌ కోసం ప్రజలు ఉడకబెట్టిన వరిని విత్తడం ప్రారంభించారు. మార్చిలో మీకు తెలియజేస్తానని మంత్రి చెప్పారు.’’ అని తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖను ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఎఫ్‌సిఐకి రాష్ట్ర ప్రభుత్వం బాయిల్డ్‌ బియ్యాన్ని పంపిణీ చేయదని గోయల్‌ సభకు తెలిపారు. ఈ అంశంపై అనుబంధ ప్రశ్న అడగడానికి టీఆర్‌ఎస్‌ సభ్యులను డిప్యూటీ చైర్మన్‌ అనుమతించకపోవడంతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img