Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పార్లమెంటులో ప్లకార్డులు, పాంప్లేట్లు కూడా నిషేధమే!

మార్గదర్శకాలు జారీ చేసిన లోక్‌ సభ సెక్రటేరియట్‌
పార్లమెంటులో ఉపయోగించకూడని పదాలు ఏంటో చెబుతూ నోటిఫికేషన్‌ జారీ చేసిన లోక్‌సభ సెక్రటేరియట్‌ తాజాగా మరిన్నింటిపై ఆంక్షలకు దిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఎవరూ కూడా పాంప్లేట్లు (కరపత్రాలు), ప్లకార్డులను లోక్‌సభలో ప్రదర్శించకూడదని మార్గదర్శకాల్లో ఉంది. పార్లమెంటులో ధర్మాలు, నిరసన ప్రదర్శనలకు అనుమతి ఇవ్వకపోవడం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు పార్లమెంటు ఆవరణలో నినాదాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజా ఆదేశాలు వెలువడ్డాయి. ఎటువంటి సాహిత్యం కానీ, ప్రశ్నలు, కరపత్రాలు, ప్రెస్‌ నోట్లు, ఇతర రూపాల్లోని సమాచారాన్ని కానీ స్పీకర్‌ ముందస్తు అనుమతి లేకుండా ప్రదర్శించడాన్ని నిషేధించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img