Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పుదుచ్చేరిలో పిల్లల్లో పెరిగిన కొవిడ్‌ కేసులు


పిల్లల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. పుదుచ్చేరిలో పిల్లల్లో 10 శాతం కోవిడ్‌ కేసులు పెరిగాయని తెలిపాయి. ఈ నేపథ్యంలో తాము పిల్లలకు సంబంధించి హాస్పిటల్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ ని, ఐసీయూ, బెడ్స్‌ సదుపాయాలను పెంచామని ఆరోగ్య శాఖ కార్యదర్శి డా.అరుణ్‌ తెలిపారు. పది శాతం కేసులు పీడియాట్రిక్‌ అని, తలిదండ్రులు తప్పనిసరిగా వ్యాక్సిన్‌ తీసుకుని.. కొవిడ్‌ ప్రొటొకాల్స్‌ పాటించాలని ఆయన సూచించారు. నిన్న పుదుచ్చేరిలో కొత్తగా 104 కి పైగా కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ కేసులు పెరగకుండా చూసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌.. తమిళిసై సౌందరరాజన్‌ సూచిస్తున్నారు. వారు తమ పిల్లలను బయటకు పంపరాదని, అలాగే తమ కుటుంబాలలోకి బయటివారిని గానీ, బంధువులను గానీ ఆహ్వానించరాదని సూచించారు. కాగా ఏపీ..విశాఖ జిల్లాలో పిల్లలకు సంబంధించి 5 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఆరేళ్ళ చిన్నారి కూడా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img