Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పులుల కోసం 97 దేశాల సమాఖ్య.. ప్రారంభించిన ప్రధాని మోదీ

పులుల సంరక్షణకు 97 దేశాలు చేతులు కలిపాయి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ పేరుతో ఒక కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమిని ప్రధాని నరేంద్ర మోదీ మైసూరు పర్యటన సందర్భంగా ప్రారంభించారు. ఏడు క్యాట్ జాతికి చెందిన ఏడు రకాల జంతువులను ఈ కూటమి కింద సంరక్షణ, పరిరక్షణ చర్యలు తీసుకుంటారు. టైగర్, లియోపార్డ్, జాగ్వార్, లయన్, స్నో లియోపార్డ్, పుమా, చీతా జాతిని కాపాడడమే ఈ సమాఖ్య లక్ష్యం.ాాఈ కూటమి ఆవశ్యకత ఎంతో ఉంది. టెక్నాలజీ పంచుకోవడం, సహకారం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా పెద్ద పిల్లి జాతి జంతువులను కాపాడుకోవచ్చు్ణ్ణ అని ప్రధాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మైసూరులోని కర్ణాటక ఓపెన్ యూనివర్సిటీ కన్వొకేషన్ హాల్ లో వన్యప్రాణుల శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ కూటమికి భారత్ నేతృత్వం వహించనుంది. వేట, చట్టవిరుద్ధమైన వన్యప్రాణుల వ్యాపారం వ్యతిరేకంగా చర్యలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్ ఆర్థిక వ్యవస్థకే కాకుండా, పర్యావరణానికీ ప్రాధాన్యం ఇస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img