Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదలకు అందుబాటులో జనరిక్‌ మందులు

ప్రధాని మోదీ వెల్లడి
న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్‌ ఔషదీ కేంద్రాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలు బాగా లబ్ధి పొందారని ప్రధాని నరేంద్రమోదీ చెప్పుకున్నారు. జన్‌ ఔషదీ కేంద్రాల ద్వారా ప్రజలకు సరసమైన ధరలకు జనరిక్‌ మందులు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ కేంద్రాలు ప్రారంభించడం వల్ల పేదలు రూ.13 వేల కోట్లు లబ్ధిపొందారని చెప్పారు. జన్‌ ఔషదీ దివస్‌ను పరస్కరించుకొని జన్‌ ఔషదీ పరియోజన లబ్ధిదారులతో మోదీ ముఖాముఖి మాట్లాడారు. ఈ పథకం నుంచి ఎలాంటి ప్రయోజనం పొందారు? ఈ పథకం ఉపయోగకరమైనదేనా? వంటి ప్రశ్నలతో లబ్ధిదారుల నుంచి మోదీ సమాధానాలు రాబట్టారు. ప్రజలకు సరసమైన ధరలకు నాణ్యమైన ఔషధాలు అందించడానికి ఫార్మాస్యూటికల్స్‌ డిపార్టుమెంట్‌ ప్రధానమంత్రి భారతీయ జనౌషదీ పరియోజన(పీఎంబీజేపీ) ప్రచారం ప్రారంభించింది. పీఎంబీజేపీ సోర్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా జనరిక్‌ ఔషధాలు సరసమైన ధరలకు అందిస్తోంది. బ్రాండెడ్‌ ఔషధాలకు సమాన సామర్ధ్యం ఈ జనరిక్‌ ఔషధాల్లో ఉంది. మెడిసిన్‌ ధరలపై ప్రజలు భయం వ్యక్తంచేయడంతో జన్‌ ఔషదీ కేంద్రాలను తగ్గించినట్లు మోదీ చెప్పారు. ‘నేడు దేశంలో 8,500 జన్‌ఔషదీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇవి ప్రభుత్వ కేంద్రాలు మాత్రమే కాదు..సామాన్యులకు పరిష్కార కేంద్రాలుగా మారాయి’అని మోదీ వ్యాఖ్యానించారు. క్యాన్సర్‌, టీబీ, మధుమేహం, గుండె సంబంధిత రోగాల చికిత్సకు ఉపయోగించే 800 ఔషధాల ధరలను తమ ప్రభుత్వం నియంత్రించిందని మోదీ తెలిపారు. స్టెంట్లు, మోకాలు మార్పిడికి సంబంధించిన పరికరాల ధరలను సైతం అదుపుచేశామన్నారు. జనరిక్‌ మందుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికిగాను మార్చి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జన్‌ ఔషదీ వారోత్సవాలు జరుగుతున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img