Friday, April 19, 2024
Friday, April 19, 2024

పొగాకు ప్రకటనలపై నిషేధం విధించాలి

ప్రభుత్వాన్ని కోరిన ఆరోగ్య నిపుణులు
న్యూదిల్లీ : పొగాకు ఉత్పత్తుల ప్రకటనలపై తక్షణమే నిషేధం విధించాలని ఆరోగ్య నిపుణులు, ప్రముఖులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా, పొగాకు నియంత్రణ చట్టం, విధానాలను పటిష్టంగా, సమర్థవంతంగా అమలు చేసేలా చూడాలని వారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రముఖ అంటు వ్యాధులు, ప్రజారోగ్య నిపుణుడు చంద్రకాంత్‌ లహరియా మాట్లాడుతూ పిల్లలు, పొగాకు రహిత వినియోగదారులు కూడా పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీవోఎస్‌)ను సందర్శించి వ్యసనానికి గురయ్యే ప్రమాదం ఉందని, పీవోఎస్‌పై సడలింపు ఇవ్వడమంటే పొగాకు మహమ్మారిని ఆహ్వానించడం లాంటిదని ఆయన సూచించారు. కోవిడ్‌`19 నేపథ్యంలో ప్రజల ఆరోగ్యంపై పొగాకు ముప్పు గురించి కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. మహమ్మారి సమయంలో పొగాకు వినియోగదారులు ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్‌కు ఎలా గురవుతున్నారో చూపించే వివిధ అధ్యయనాలను ఉదహరించారు. ‘ప్రతి జీవితం విలువైనది. పొగాకు సంబంధిత వ్యాధుల వల్ల మనం ప్రతి సంవత్సరం 1.3 మిలియన్ల మంది భారతీయులను కోల్పోతున్నాం. కేన్సర్‌తో పాటు ఊపిరితిత్తుల వ్యాధులు, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్స్‌ వంటి అనేక రకాల దీర్ఘకాలిక, ప్రాణాంతక పరిస్థితులకు పొగాకు కూడా ప్రధాన కారణం’ అని ఆయన చెప్పారు. ధూమపానం చేయని వారికి ఆరోగ్య ప్రమాదం ఉన్నందున, విమానాశ్రయాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో వాటిని నిషేధించాలనే డిమాండ్‌ను అంటు వ్యాధుల నిపుణుడు సమర్థించారు. ప్రఖ్యాత మల్లయోధుడు, నటుడు సంగ్రామ్‌ సింగ్‌ మాట్లాడుతూ పిల్లలను ధూమపానం ప్రారంభించేలా ప్రభావితం చేసే విస్తృతమైన ప్రకటనలు, ప్రచార కార్యకలాపాలకు భయంకరమైన సాక్ష్యాలు ఉన్నాయని, జీవితకాల వ్యసనానికి అలవాటు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పొగాకు ప్రకటనలపై నిషేధం ఉన్నప్పటికీ, పరిశ్రమలు వివిధ మార్కెటింగ్‌ వ్యూహాలను అవలంబించడం ద్వారా అటువంటి వస్తువుల ప్రచారానికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘అటువంటి ప్రకటనలను తక్షణమే నిషేధించాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను’ అని ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన తెలిపారు. న్యూదిల్లీ ఎయిమ్స్‌ రుమటాలజీ విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ ఉమా కుమార్‌ మాట్లాడుతూ సిగరెట్లు, గుట్కా వంటి ఉత్పత్తులను తయారు చేసే పొగాకు కంపెనీలు ప్రత్యేకంగా యువకులు, పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అన్నారు. ‘తమ ప్రకటనలను పాఠశాల, కళాశాలల దగ్గర ప్రముఖంగా ప్రదర్శిస్తారు. తద్వారా అవి ఆకట్టుకునే మనస్సులకు కనిపిస్తాయి. వీటిని పూర్తిగా నిషేధించాలి’ అని కోరారు. ఈ వ్యసనాలకు గురిచేసే ఉత్పత్తుల నుంచి యువతను రక్షించడం చాలా అవసరమని నొక్కి చెప్పారు. ధూమపానం చేయని వారికి, ముఖ్యంగా పిల్లలు, మహిళలకు నిష్క్రియ ధూమపానం వల్ల కలిగే నష్టాలను డాక్టర్‌ ఉమా కుమార్‌ ప్రధానంగా ప్రస్తావించారు. ‘పొగాకు ఉత్పత్తులు క్యాన్సర్‌ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. దేశంలో దాదాపు 13 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం పొగాకు నియంత్రణ చట్టం, విధానాలను మరింత పటిష్టంగా తయారు చేయడం, సమర్థవంతంగా అమలు చేయడం చాలా కీలకం’ అని ఆమె పునరుద్ఘాటించారు. కమ్యూనికేషన్‌ నిపుణుడు నీలకంఠ్‌ బక్షి కూడా కేంద్రం తీసుకున్న వివిధ పొగాకు వ్యతిరేక చర్యలను ప్రస్తావిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజల ఆరోగ్యం గురించి ముఖ్యంగా యువత గురించి చాలా ప్రత్యేకతతో ఉన్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img