Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోప్‌ ఫ్రాన్సిస్‌ను భారత్‌కు ఆహ్వానించిన మోదీ

కేథలిక్‌ చర్చ్‌ అధిపతి పోప్‌ ఫ్రాన్సిస్‌ను ప్రధాని నరేంద్రమోదీ భారత్‌కు ఆహ్వానించారు. వీరిద్దరూ శనివారం వాటికన్‌ సిటీలో పోప్‌ ఫ్రాన్సిస్‌తో భేటీ అయ్యారు.దాదాపు 30 నిమిషాలపాటు సమావేశమైన వీరు ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు, కొవిడ్‌ మహమ్మారి వంటి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.రోమన్‌ క్యాథలిక్‌ హెడ్‌ను మోదీ ముఖాముఖి కలవడం ఇదే తొలిసారి. ఆయనతో దిగిన చిత్రాలను ప్రధాని మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో పంచుకున్నారు. పోప్‌ను భారత్‌కు ఆహ్వానించినట్లు తెలిపారు. 1999లో పోప్‌ జాన్‌ పాల్‌-2 భారత దేశంలో పర్యటించారు. అప్పట్లో అటల్‌ బిహారీ వాజ్‌పాయి ప్రధాన మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కేథలిక్‌ చర్చ్‌ అధిపతి మన దేశంలో పర్యటించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా పోప్‌ ఫ్రాన్సిస్‌ను ఆహ్వానించారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ ఇటలీ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img