Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు కొత్త నిబంధనలు


వచ్చే నెల 1 నుంచి అమల్లోకి..
పోస్టల్‌ బ్యాంకు ఖాతాదారులకు కొత్త నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, ఐపీపీబీ కస్టమర్లు డోర్‌ స్టెప్‌ బ్యాంకింగ్‌ సేవలకు చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ సేవలకు ఎలాంటి చార్జీలు వసూలు చేయడం లేదు. వచ్చే నెల 1 నుంచి మాత్రం చార్జీలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఐపీపీబీ కస్టమర్లకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించేసింది. ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంక్‌లో ఖాతా కలిగిన వారికి ఇప్పుడు 2.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అలాగే పోస్టాఫీస్‌ ఖాతాదారులు వారి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవడానికి, మనీ ట్రాన్స్‌ఫర్‌ సర్వీసులను, ఇతర ఆర్థిక సేవలను ఇప్పుడు ఐపీపీబీ యాప్‌ ద్వారానే పొందొచ్చు. పోస్టాఫీస్‌ బ్రాంచుకు వెళ్లాల్సి న అవసరం ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img