Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పోస్టాఫీసుల్లోనూ రైల్‌ టికెట్ల బుకింగ్‌

న్యూదిల్లీ : భారతీయ రైల్వే.. ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. టెక్నాలజీని అందిపుచ్చుకుని ప్రయాణీకులకు మరిన్ని సదుపాయాలను అందిస్తోంది. ఇప్పుడు తాజాగా రైలు టికెట్లు పోస్టాఫీసుల్లో కూడా బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించింది. ఇందుకోసం టికెట్‌ బుకింగ్‌ను నిర్వహించే సంస్థ ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించింది. ఇప్పుడు రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఆఫ్‌లైన్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవడానికి క్యూలైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. మీరు మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా కూడా రైలు టిక్కెట్లను కూడా బుక్‌ చేసుకోవచ్చు.
పోస్టాఫీసుల నుంచి బుక్‌ చేసుకునే సదుపాయం ముందుగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రారంభించింది ఐఆర్‌సీటీసీ. రాష్ట్రంలో సుమారు 9147 పోస్టాఫీసులలో టిక్కెట్‌ బుకింగ్‌ సౌకర్యం అందుబాటులో తీసుకువచ్చింది. ఈ సదుపాయాన్ని ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రారంభించారు. రాష్ట్ర రాజధానిలోని స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గోమతి నగర్‌ రైల్వే స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన రెండవ ప్రవేశ ద్వారం సహా టెర్మినల్‌ సౌకర్యాలు, కోచింగ్‌ కాంప్లెక్స్‌ను రైల్వే మంత్రి ప్రారంభించారని ఉత్తర మధ్య రైల్వే (ఎన్‌సిఆర్‌) చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ శివం శర్మ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img