Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ప్రతిభ, సీనియారిటీ ఆధారంగానే..

న్యూదిల్లీ : సుప్రీంకోర్టు కొలీజియం నిబంధనలు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగానే హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియ జరిగిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా ఎ వెంకటేశ్వర్‌ రెడ్డిని నియమించడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది బి శైలేష్‌ సక్సేనా దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. తెలంగాణ హైకోర్టు రిజిస్రార్‌గా ఉన్న వెంకటేశ్వ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ఆయన నియామకం కోసం రాష్ట్ర హైకోర్టు చేసిన సిఫార్సు సరైందని కాదని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనై చట్టం చర్యలకు ఆదేశించాలని కోరారు. ఈ వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అన్ని నిబంధనలు పాటిస్తూ ప్రతిభ, సీనియారిటీ ఆధారంగానే చేపట్టినట్లు పేర్కొంటూ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను అర్థరహితమని కొట్టి వేసింది. న్యాయమూర్తి ప్రతిష్టకు భంగం కలగించేలా పిటిషన్‌ దాఖలు చేసినందుకు, కోర్టు ప్రొసీడిరగ్‌ను దుర్వినియోగం చేసినందుకు పిటిషనర్‌ రూ. 5లక్షల జరిమాన చెల్లించాలని ఆదేశించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img