Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రధాని చేతులు కలుపుదామన్నారు

సాధ్యం కాదన్నాను : పవార్‌
పూనె : గత ఎన్నికల సమయంలో మహారాష్ట్రలో బీజేపీ, ఎన్‌సీపీ కలిసి పోటీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారని, అయితే, అది సాధ్యం కాదని తాను చెప్పానని ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ తెలిపారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారం కోసం విశ్వప్రయత్నం చేసిందని, ఎవరు చేయి కలిపినా అందుకోవడానికి ఆరాటపడిరదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలపై పవార్‌ పైవిధంగా స్పందించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసి పోటీ చేయడానికి మోదీ ఆరాటపడ్డారని పవార్‌ చెప్పారు. ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో తాము ఎప్పటికప్పుడు తెలుసుకున్నామని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టామని సంజయ్‌రౌత్‌ తెలిపారు. సీఎం పదవి పంపిణీపై సుదీర్ఘకాలం మిత్రపక్షంగా కొనసాగిన బీజేపీతో శివసేన ఎన్నికల అనంతరం బంధం తెంచుకుంది. రాష్ట్రంలో మహా వికాస్‌ అఘాదీ(ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటు కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో శివసేన అవగాహన కుదుర్చుకున్నది. మరాఠి దినపత్రిక లోక్‌సత్తా నిర్వహించిన కార్యక్రమంలో పవార్‌ మాట్లాడుతూ 2019 ఎన్నికల తర్వాత పరిణాల గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్‌ను తొలగించి…ఎన్‌సీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా అడిగారని గుర్తుచేశారు. బీజేపీ, ఎన్‌సీపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతో మోదీ చాలాసార్లు సమావేశమయ్యారని చెప్పారు. ‘ఎన్‌సీపీ`బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం మోదీ ఆకాంక్ష. నేను ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి అది సాధ్యం కాదని చెప్పాను. బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం మాకు ఇష్టం లేదు. మా వైఖరి భిన్నమైనది’ అని వివరించానన్నారు. తన సమాధానానికి ప్రధాని స్పందిస్తూ ‘మరోసారి ఆలోచించండి’ అని చెప్పారన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత దాదాపు 90 రోజులు ప్రభుత్వమే ఏర్పడలేదన్నారు. ఎన్‌సీపీతో కలవడం వల్ల సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రధాని అన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎన్‌సీపీ నాయకులపై బీజేపీ అనేక అవినీతి ఆరోపణలు చేసింది కదా..అలాంటప్పుడు మీరు ఎలా కలిశారని అడుగగా బీజేపీ తమ సాయం కోరింది..అంతే. అంతకుమించి ఆలోచించాలని తాను భావించలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మధ్య చాలాసార్లు చర్చలు జరిగాయని, రెండు పార్టీల మధ్య వాదోపవాదాలు జరిగాయని పవార్‌ గుర్తుచేశారు. ఈ పరిస్థితులను బీజేపీ అవకాశంగా తీసుకుందామని భావించి ఉండవచ్చని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img