Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులకు కేంద్రం హెచ్చరిక

రోగులకు జనరిక్ మందులనే సూచించాలని కేంద్ర ప్రభుత్వ వైద్యులకు ఆదేశాలు
వైద్య సేవల డైరెక్టర్ జనరల్ ఆదేశాల జారీ

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులకు కేంద్రం తాజాగా ఓ హెచ్చరిక చేసింది. ప్రభుత్వ వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులనే సూచించాలని స్పష్టం చేసింది. ఈ రూల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆసుపత్రుల్లో మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలపై కూడా పరిమితి ఉండాలని వైద్యులకు సూచించింది.ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ అతుల్ గోయల్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. వైద్యులు తమ రోగులకు బ్రాండెడ్ ఔషధాలు రాస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img