Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రియాంక పోరాటాలతో..యూపీ కాంగ్రెస్‌లో నూతనోత్తేజం

: దిగ్విజయ్‌ సింగ్‌
సంబాల్‌ (యూపీ) : ప్రజా సమస్యలను లేవనెత్తడం ద్వారా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌ ప్రజలలో కొత్త విశ్వాసాన్ని నింపారని ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. గతానికి భిన్నంగా రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీ గురించి చర్చించుకునే స్థాయిలో ఆమె చేస్తున్న పోరాటాలున్నా యంటూ కితాబిచ్చారు. ఇది ప్రియాంక సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు. లఖింపూర్‌ ఖేరీ హింసాకాండ, రైతులు, కార్మికులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల ప్రజల సమస్యలపై ప్రియాంక గాంధీ చొరవ తీసుకుని పోరాటం చేయడం ద్వారా రాష్ట్రంలో పార్టీకి నూతనోత్తేజాన్ని, కొత్త బృందాన్ని అందించారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీలపై విమర్శలు చేస్తున్న బీఎస్‌పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఆమెకు చరిత్ర తెలియదేమోనని వ్యాఖ్యానించారు. ఆమె పుట్టకముందు నుంచీ దళితుల సమస్యల పరిష్కారం కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తోందని, గాంధీ అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రచారం చేశారని గుర్తు చేశారు. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణల విషయంలో కేంద్రం వ్యవహారశైలిని తప్పుబట్టారు. మతం పేరుతో ప్రజలను విభజించడమే బీజేపీ ఎజెండా అని ఆరోపించారు. బీజేపీకి హిందూ మతంతో సంబంధం లేదని, మతం పేరుతో ప్రజలను విభజించి, భయాందోళనలకు గురిచేసి విద్వేషాలు సృష్టించడమే పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. ఈ విషయంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు బీజేపీకి సహకరిస్తుందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img