Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రైవేట్‌ ఆస్పత్రికి వాజే..కోర్టు అనుమతి

ముంబై : మాజీ పోలీసు అధికారి సచిన్‌ వాజే ముంబైలోని ఆసుపత్రిలో వైద్య చికిత్స పొందేందుకు ఇక్కడ ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు గురువారం అనుమతించింది. గుండె సంబంధిత శస్త్ర చికిత్స కోసం ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తనను తరలించాలని వాజే కోర్టును అభ్యర్థించాడు. అంటిలియా బాంబు బెదిరింపు, మన్‌సుఖ్‌ హిరన్‌ హత్య కేసులో నిందితుడిగా ఉన్న వాజే ప్రస్తుతం థానేలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ముంబైలోని ఒక ఆసుపత్రికి తనను తరలించేలా కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ వాజే మంగళవారం ఒక పిటిషన్‌ దాఖలు చేసినట్లు డిఫెన్స్‌ న్యాయవాది ఒకరు తెలిపారు. అయితే షరతులకు లోబడి అతని పిటిషన్‌ను ప్రాసిక్యూషన్‌ తోసిపుచ్చలేదు. నిందితుడు తన వైద్యుని పర్యవేక్షణలో ముంబైకు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలో కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్టింగ్‌(సీఏబీజీ) శస్త్ర చికిత్స, తగిన వైద్యం చేయించుకోవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తెలిపింది. అలాగే చికిత్స సమయంలో వాజేకు తగిన భద్రత కల్పించాలని పోలీసు కమిషనర్‌, సంబంధిత జైలు యంత్రాంగానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఎన్‌ఐఏ కోర్టును కోరింది. అతని చికిత్స గురించి అవసరమైన నిర్ణయం కోసం, తగిన రక్షణ తీసుకునేందుకు అతనితో ఉండేందుకు వాజే భార్యను అనుమతించాలని కూడా కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. వాజే అభ్యర్థనను అనుమతించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img