Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

బారికేడ్లపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసు

న్యూదిల్లీ : పౌరులకు అసౌకర్యం కల్పించేలా దేశ రాజధాని రోడ్లపై ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించాలని కోరుతూ దాఖలు చేసిన ప్రజాప్రయోజన పిటిషన్‌పై కేంద్రం, నగర పోలీసులకు దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నగరంలో అనవసరంగా బారికేడ్లు ఏర్పాటు చేశారని పిటిషనర్‌ ఆరోపించారు. పిటిషన్‌పై సమాధానం చెప్పాలని కేంద్రం, పోలీసులను ఆదేశిస్తూ చీఫ్‌జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ జ్యోతిసింగ్‌లతో కూడిన ధర్మాసనం నోటీసులు పంపింది. కేసు తదుపరి విచారణను నవంబరు 2వ తేదీకి వాయిదా వేసింది. దిల్లీ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారని, దీనిపై కేంద్రానికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అజయ్‌ దిగ్పాల్‌ చెప్పారు. పిటిషన్‌ను జనసేవ వెల్ఫేర్‌ సొసైటీ వేయించింది. బారికేడ్ల నిర్మాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, తెలివిలేని వారు చేసినట్లు ఉందని పిటిషన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img