Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బాలుడికి కల్వర్టుతో వివాహం.. జార్ఖండ్‌లోని గిరిజనులకు ఓ వింత ఆచారం!

జార్ఖండ్‌లోని గిరిజనులకు ఓ వింత ఆచారం ఉంది. పిల్లలకు తొలి దంతం కనుక పైదవడకు వస్తే ఐదేళ్లలోపు వారికి చెట్టుకు కానీ, కల్వర్టుకు కానీ ఇచ్చి పెళ్లి చేస్తారు. తాజాగా, ఓ బాలుడికి అలానే తొలి దంతం పై దవడకు రావడంతో ఘనంగా కల్వర్టుతో వివాహం జరిపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తూర్పు సింగ్‌భూమ్‌ జిల్లాలోని పోట్కా ప్రాంతానికి చెందిన సరీ సింగ్‌ సర్దార్‌ తన మనవడికి ఇలానే తొలి దంతం పైదవడకు వచ్చింది. దీంతో బాలుడిని పెళ్లికొడుకులా ముస్తాబు చేసి బొమ్మ బైక్‌పై ఊరేగిస్తూ కల్వర్టు వద్దకు తీసుకెళ్లి వివాహం జరిపించారు. మకర సంక్రాంతి తర్వాత రెండో రోజు గిరిజనులు ఇక్కడ అఖన్న జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా బాలుడికి ఘనంగా వివాహం జరిపించారు. తొలి దంతం పైదవడకు వచ్చిన చిన్నారులకు కల్వర్టుకు కానీ, చెట్టుకు కానీ ఇచ్చి వివాహం జరిపించకుంటే పెళ్లయిన తర్వాత వారి భాగస్వామి మరణిస్తారని గిరిజనులు విశ్వసిస్తారు. అందుకే అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని గిరిజనులు ఇప్పటికీ పాటిస్తుంటారు. చిన్నారులకు ఐదేళ్లు వచ్చే లోపే వారికి వివాహం జరిపిస్తుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img