Friday, April 19, 2024
Friday, April 19, 2024

బీజేపీకి అనుకూలించని బిజ్నోర్‌ వాతావరణం

జయంత్‌ చౌదరి ఎద్దేవా
లక్నో : ఉత్తరప్రదేశ్‌, బిజ్నోర్‌లో వాతావరణం బీజేపీకి అనుకూలంగా లేదంటూ రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత జయంత్‌ చౌదరి విమర్శించారు. సోమవారం ప్రధాని మోదీ పర్యటన రద్దుపై స్పందించారు. బీజ్నోర్‌లో సూర్యుడు మెరుస్తున్నాగానీ వాతావరణం బీజేపీకి అనుకూలం కాదని ట్వీట్‌ చేశారు. ఆ ర్యాలీలో ముఖ్యమంత్రి యోగి ఆతిద్యనాథ్‌ పాల్గొని వాతావరణం సరిగ్గా లేక హెలికాప్టర్‌ ప్రయాణం కష్టమై మోదీ గైర్హాజరు అయ్యారని, తాను కూడా ఆలశ్యంగా వచ్చానని చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలను చౌదరి తనదైన శైలిలో విమర్శించారు. చౌదరిని కమలం దళంలోకి తెచ్చుకోవాలని బీజేపీ అగ్రనేతలు చాలా ప్రయత్నాలే చేశారు. ఆయనకున్న జాట్‌ ఓటర్ల బలాన్ని లాక్కునేలా పావులు కదిపారు. చౌదరిని బుట్టలో దించేందుకు బీజేపీ అగ్రనేత అమిత్‌ షా కృషిచేసినా ఫలితం లేదు. ఆర్‌ఎల్‌డీతో పొంతు ప్రతిపాదనÑ ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచేస్తారన్న బెదిరింపులు కూడా చౌదరిపై పనిచేయలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img