Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బీజేపీ, ఆర్‌ఎస్సెస్‌లను చూసే ఎలా ఉండకూడదో నేర్చుకుంటున్నా : రాహుల్‌ గాంధీ

బీజేపీ, ఆరెస్సెస్‌ తనకు గురువు లాంటివి అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. వాటిని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. భారత్‌ జోడో యాత్ర నుంచి విరామం తీసుకున్న రాహుల్‌ గాంధీ.. ఢల్లీిలో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు చేశారు. జోడో యాత్రంలో తాను ఉత్సాహంగా ఉండటం వెనుక ఉన్న సీక్రెట్‌ గురించి ఓ వీడియో విడుదల చేస్తానని రాహుల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీని తాను గురువులా భావిస్తానని అన్నారు. బీజేపీ తనకు రోడ్‌మ్యాప్‌ ఇస్తోందని పేర్కొన్నారు. బీజేపీని చూసే తాను ఎలా ఉండకూడదో, ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నాను అంటూ సెటైర్లు వేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తమపై ఎంత దూకుడుగా దాడి చేస్తే.. తమ పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు అంతగా సాయపడుతుందని రాహుల్‌ వ్యాఖ్యానించారు. ‘భారత్‌ జోడో యాత్ర’ నుంచి విరామం తీసుకున్న రాహుల్‌ గాంధీ శనివారం (డిసెంబర్‌ 31) ఢల్లీిలో మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత్‌ జోడో యాత్రను తాను కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు ఒక సాధారణ యాత్రగా ప్రారంభించానని.. అయితే, అది క్రమంగా ప్రజల గొంతుకగా మారి, వారి భావోద్వేగాలను ప్రతిబింబింస్తోందని రాహుల్‌ తెలిపారు.భారత్‌ జోడోను నేను కేవలం యాత్రగానే ప్రారంభించా. కానీ, ఇది ప్రజల గొంతుక అవుతుందని నాడు ఊహించలేదు. ఈ సందర్భంగా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలకు నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. వారు ఎంతగా మమ్మల్ని టార్గెట్‌ చేస్తే.. మేం అంత దృఢంగా మారుతాం. వాళ్లను నేను గురువులుగా భావిస్తున్నా. వాళ్లను చూసే నేను ఎలాంటి పనులు చేయకూడదో నేర్చుకుంటున్నా’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img