Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బుధ, గురువారాల్లో ‘సుప్రీం’ భౌతిక విచారణలు

మహమ్మారి తర్వాత పునరుద్ధరణ చర్యలు
న్యూదిల్లీ : భౌతిక విచారణలను పునరుద్ధరించే దిశగా సుప్రీం కోర్టు అక్టోబరు 20వ తేదీ నుంచి బుధ, గురువారాల్లో జాబితా చేయబడిన అన్ని విషయాలను న్యాయవాదుల భౌతిక సమక్షంలో న్యాయస్థానాలలో మాత్రమే విచారణ చేయనున్నట్లు గురువారం తెలిపింది. కోవిడ్‌`19 మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి నుంచి సుప్రీం కోర్టు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణను నిర్వహిస్తోంది. అయితే తక్షణమే భౌతిక విచారణలను పునరుద్ధరించాలని న్యాయవాదులు, అనేక బార్‌ కౌన్సిల్స్‌ డిమాండ్‌ చేస్తున్నాయి. తాజాగా జారీ చేసిన ఒక ప్రామాణిక నిర్వహణా విధానం(ఎస్‌వోపి)లో బార్‌ నుండి ప్రోత్సాహకరమైన ప్రతిస్పందనను దృష్టిలో ఉంచుకుని భౌతిక రూపంలో విచారణలను సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేశ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ‘బుధవారం, గురువారం జాబితా చేయబడిన అన్ని విషయాలు కేవలం న్యాయవాదులు, కక్షిదారుల భౌతిక సమక్షంలో కోర్టు గదుల్లో మాత్రమే విచారణ చేయడం జరుగుతుంది’ అని తెలిపింది. అలాగే మంగళవారం జాబితా చేయబడిన అన్ని విషయాలను భౌతికంగా విచారణ చేయడం జరుగుతుందని, అలాగే పార్టీ కోసం ఏవోఆర్‌ (అడ్వొకేట్‌-ఆన్‌-రికార్డ్‌) ద్వారా ముందుగా దరఖాస్తు చేసుకుంటే, వీడియో/టెలికాన్ఫరెన్సింగ్‌ విధానం ద్వారా హాజరయ్యే సదుపాయం కల్పించనున్నట్లు వివరించింది. ఏవోఆర్‌ అనేది ఒక న్యాయవాది సుప్రీం కోర్టులో పార్టీ కోసం వ్యవహరించే హక్కు అని పేర్కొంది. కోర్టు ఆదేశించకపోతే, ఇతర విషయాల గురించి వాటి స్వభావంతో సంబంధం లేకుండా తదుపరి ఉత్తర్వుల వరకు వీడియో/టెలికాన్ఫరెన్సింగ్‌ విధానం ద్వారా కూడా విచారణ కొనసాగుతుందని తెలిపింది. కాగా, సుప్రీం కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే వారందరికీ మాస్క్‌లు ధరించడం, హ్యాండ్‌ శానిటైజర్‌ను తరచుగా ఉపయోగించడం, సురక్షితమైన దూర నిబంధనలను పాటించడం వంటి అంటువ్యాధి నివారణకు మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img