Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బెంగాల్‌లో బీజేపీకి ఎదురు దెబ్బ..

కోల్‌కతా కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీఎంసీ విజయం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీికి మరో ఘోర పరాజయం ఎదురైంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఏడు నెలల తర్వాత అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం కోల్‌కతా మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి ప్రభావమూ చూపించలేకపోయింది. మొత్తం 144 వార్డులకుగాను 124 వార్డుల్లో టీఎంసీ అభ్యర్థులు గెలుపొందగా, మరో 13 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ ఒకే ఒక సీటును దక్కించుకోగా, మరో మూడు వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాంగ్రెస్‌ రెండు వార్డులను దక్కించుకోగా, సీపీఎం నేతృత్వంలోని వామపక్ష కూటమి రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉదయం 8 గంటలకు కేఎంసీకు చెందిన 144 వార్డుల ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కాగా భారీ విజయాన్ని అందించిన కోల్‌కతా నగర ప్రజలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలిపారు. తన నివాసం వద్ద ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ విజయాన్ని రాష్ట్ర ప్రజలకు, మా, మతి, మనుష్‌ (తల్లి, భూమి, ప్రజలు – టీఎంసీ నినాదం)కి అంకితం చేయాలనుకుంటున్నాను’ అని అన్నారు. ఈ విజయం రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో మార్గం చూపుతుందని తెలిపారు. కడపటి సమాచారం ప్రకారం, టీఎంసీ 124 స్థానాలను గెలుచుకుని, 13 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్‌ 22 స్థానాల్లో విజయం సాధించింది. సీపీఐ, సీపీఎం చెరొక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయని ఎన్నికల సంఘం తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img