Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బొగ్గు ఉత్పత్తి పెంచాలని కోరిన ప్రభుత్వం

న్యూదిల్లీ : బొగ్గు గనుల యజమానులు వారి తుది వినియోగ ప్లాంట్ల కోసం ఉత్పత్తిని పెంచాలని బొగ్గు మంత్రిత్వ శాఖ కోరింది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి ఇంధన సరఫరా నియంత్రణకు పేలవమైన ఉత్పత్తి విషయంలో దిద్దుబాటు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించింది. దేశంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు బొగ్గు కొరతను ఎదుర్కొంటున్న నడుమ అంబుజా సిమెంట్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఎన్‌టీపీసీ వంటి బొగ్గు గనుల యజమానులను ఈ మేరకు ఆదేశించింది. ‘విద్యుత్‌ కేంద్ర బొగ్గు గనుల నుంచి ఉత్పత్తి తగ్గిపోవడం, దేశంలో బొగ్గు కొరత నేపథ్యంలో మీ విద్యుత్‌ కేంద్ర అవసరాలను తీర్చేందుకు తగిన స్థాయిలో ఉత్పత్తిని పెంచాలి’ అని బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక లేఖలో కోరింది. వచ్చే వారం సమీక్షించనున్నట్లు పేర్కొంది. కాగా బొగ్గు ఉత్పత్తిని ఇటీవల నామినేటెడ్‌ అథారిటీ సమీక్షించినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. కేటాయింపుదారులు అనేక మంది ఉత్పత్తి షెడ్యూల్‌లో వెనుకబడి పోతున్నారని తెలిపింది. ‘దేశంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి విద్యుత్‌కు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్ల నుంచి బొగ్గు ఉత్పత్తికి డిమాండ్‌ పెరిగింది’ అని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img