Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బొగ్గు కొరత లేదు : మంత్రి జోషి

న్యూదిల్లీ : దేశంలో బొగ్గుకు ఎలాంటి కొరత లేదని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి సోమవారం పార్లమెంటుకు తెలిపారు. భారీ వర్షాల కారణంగా బొగ్గు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిరదని, ఉత్పత్తి కేంద్రాల నుంచి సకాలంలో బొగ్గు సరఫరా చేయలేకపోయామని తెలిపారు. ఇదే సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిందని, బొగ్గు దిగుమతిలో ఇబ్బందులు ఏర్పడటంతో ఉత్పత్తి తగ్గిందని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. 2021 అక్టోబరు 8వ తేదీ నాటికి విద్యుత్‌ కేంద్రాల వద్ద నాలుగు రోజులకు సరిపడే 7.2మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని తెలిపారు. అప్పటి నుంచి బొగ్గు సరఫరాను పెంచామని, బొగ్గు నిల్వలు పెరిగాయని, నవంబరు 29వ తేదీ నాటికి 9 రోజులకు సరిపడా 17.29 మిలియన్‌ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి జోషి చెప్పారు. గతేడాది ఏప్రిల్‌అక్టోబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే కాలంలో కోల్‌ ఇండియా లిమిటెడ్‌(సీఐఎల్‌) 54 మిలియన్‌ టన్నులు సరఫరా చేసినట్లు వివరించారు. ఏప్రిల్‌అక్టోబరు మధ్యకాలంలో బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి 594.34 బీయూలకు పెరిగినట్లు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నివేదిక వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img