Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారతీయ రైల్వే కీలక నిర్ణయం

రైళ్లను ట్రాక్‌ చేసేందుకు.. కొత్త సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తున్న ఇండియన్‌ రైల్వే..!
భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లోకోమోటివ్‌ల కదలికలను ట్రాక్‌ చేసేందుకు రియల్‌ టైమ్‌ ట్రైన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ను రైల్వే ఇన్‌స్టాల్‌ చేస్తోంది. ఇండియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 30 సెకన్ల వ్యవధితో ఆర్‌టీఐఎస్‌ మిడ్‌ సెక్షన్‌ అప్‌డేట్స్‌ను అందిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైలు వెళ్లే వేగం, రైళ్ల స్థానం ఎలాంటి మాన్యువల్‌ జోక్యం లేకుండా ఆటోమేటిక్‌గా ట్రాక్‌ చేయబడుతాయని పేర్కొంది. 21 ఎలక్ట్రిక్‌ లోకో షెడ్స్‌లో 2700 లోకోమోటివ్‌లకు రియల్‌ టైమ్‌ ట్రైన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్‌ చేసినట్లు రైల్వేమంత్రిత్వ శాఖ పేర్కొంది.ఫేజ్‌-2లో ఇస్రో శాట్‌కామ్‌ హబ్‌ని వినియోగించడం ద్వారా 50 లోకో షెడ్లలో 6వేల లోకోమోటివల్‌లు కవర్‌ చేయబడుతాయని, ప్రస్తుతం, దాదాపు 6500 లోకోమోటివ్‌ల నుంచి జీఎపీఎస్‌ ఫీడ్‌ నేరుగా కంట్రోల్‌ ఆఫీస్‌ అప్లికేషన్‌ కి అందించబడుతోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img