Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

భారత్‌లో కొత్తగా 45 వేల ఖాతాలు బ్యాన్‌ చేసిన ట్విట్టర్‌

నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో భారత్‌లో కొత్తగా 45 వేల ఖాతాలను బ్యాన్‌ చేసినట్లు ట్విట్టర్‌ వెల్లడిరచింది. వీటన్నింటినీ కూడా జులై నెలలోనే నిషేధించినట్లు వెల్లడిరచింది. ఇలా నిషేధించిన ఖాతాల్లో 42,825 ఖాతాలు చిన్నపిల్లల సెక్సువల్‌ ఎక్స్‌ప్లాయిటేషన్‌ నిబంధనలు ఉల్లంఘించాయని, ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించాయని, అలాగే కన్సెంట్‌ లేని న్యూడిటీని కూడా ప్రమోట్‌ చేశాయని ట్విట్టర్‌ తెలిపింది. మిగతా 2,366 ఖాతాలు ఉగ్రవాదాన్ని ప్రమోట్‌ చేయడంతో బ్యాన్‌ చేసినట్లు వివరించింది. అంతకుముందు జూన్‌ నెలలో కూడా 43 వేల భారతీయ ఖాతాలను ట్విట్టర్‌ బ్యాన్‌ చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img