Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

భారీ వర్షాలకు వణుకుతున్న చెన్నై.. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి

చెన్నైలో సాధారణం కంటే 20 అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై నగరం విలవిల్లాడుతోంది. రోడ్లు నదులను తలపిస్తుండటంతో ప్రజలు బయటకు రావాలంంటే భయపడుతున్నారు. భారీ వర్షం కారుణంగా వాషర్‌మెన్‌ పేటలో 50 ఇళ్లు నీట మునిగాయి. గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరింది. అటు, భారీ వర్షానికి మెరీనా తీరంలో నీరు నిలిచిపోవడంతో ఈ ప్రాంతమంతా సంద్రాన్ని తలపిస్తోంది. ముఖ్యంగా మెరీనా తీరంలో ఉన్న సర్వీస్‌ రోడ్డులో ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందిగా మారింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో స్టాలిన్‌ సర్కారు అప్రమత్తమయ్యింది. రెండు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాలకు తిరువణ్ణామలై జిల్లాలో ఒకరు మృతిచెందారు. న్నై కార్పొరేషన్‌లో 169 పునరావాస శిబిరాలు సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వాననీటిని తొలగించేందుకు 906 మోటార్లు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌కి చెందిన 1149 మంది, తమిళనాడు డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌కి చెందిన 899 మంది సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. రంగరాజపురం, సూరప్పట్టు వినాయగపురం సబ్‌వేలలో రాకపోకలకు నిషేధం విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. పుదుచ్చేరిలోనూ విద్యా సంస్థలకు రెండు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. సహాయక చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధం చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిరదని భారత వాతావరణ విభాగం వెల్లడిరచింది. ప్రస్తుతం తమిళనాడు, పుదుచ్చేరికి సమీపంలోకి చేరిన అల్పపీడనం.. సాయంత్రానికి తమిళనాడు, కేరళ ప్రాంతాలను దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో గత 24 గంటల్లో పలు చోట్ల భారీవర్షం నమోదు అయింది. రాబోయే మూడు రోజులపాటు కూడా భారీ కురిసే అవకాశం ఉందని, కడలూరు, డెల్టా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీవర్షం కురుస్తుందని ఐఎండీ పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img