Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మంగళూరు కళాశాలలో విద్యార్థుల ఘర్షణ

మంగళూరు : నగరంలోని విశ్వవిద్యాలయ కళాశాల వద్ద రెండు విద్యార్థి గ్రూపులు ఘర్షణకు దిగాయి. కొన్ని రోజుల క్రితం తరగతి గదిలో వీర సావర్కర్‌, భారత మాత చిత్ర పటాలను కొంతమంది విద్యార్థులు ఏర్పాటు చేయడం వివాదంగా మారిందని పోలీసు వర్గాలు శనివారం తెలిపాయి. ఇతర విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వచ్చిన తర్వాత కళాశాల యాజమాన్యం తర్వాతి రోజు ఆ చిత్రపటాలను తొలగించింది. విద్యార్థుల గ్రూపు ఆ చిత్రపటాలను ఏర్పాటు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ఈ ఘర్షణలో స్వల్ప గాయాలైన ముగ్గురు విద్యార్థులను ఒక ఆస్పత్రిలో చేర్చారు. ఘర్షణకు దారితీసిన చిత్రపటాలపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా విద్యార్థుల బృందం ఇతర విద్యార్థులతో వాగ్వాదానికి దిగడంతో శుక్రవారం సమస్య మళ్లీ తెరపైకి వచ్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. కాగా మంగళూరు సౌత్‌ పోలీసులకు రెండు విద్యార్థి గ్రూపులు పరస్పరం ఫిర్యాదు చేశాయని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్‌ అనసూయ రాయ్‌ మాట్లాడుతూ ఈ ఘర్షణలో పాల్గొన్న విద్యార్థులను గుర్తించనున్నామని, అంతర్గత విచారణ తర్వాత వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img