Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మహారాష్ట్రలో విరిగిపడిన కొండచరియలు…కొనసాగుతోన్న సహాయచర్యలు

భారీ వర్షాల కారణంగా మహారాష్ట్రలోని వసాయ్‌లో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు, స్థానికులు ప్రయత్నిస్తున్నారు.వాసాయిలోని వాగ్రపాడు ప్రాంతంలోని ఓ ఇంటిపై కొండచరియల శిథిలాలు పడ్డాయి.రెస్క్యూ అధికారులు సైట్‌ నుంచి నలుగురిని రక్షించారు.మరో ఇద్దరు ఇప్పటికీ శిథిలాల కింద చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌) ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.మంగళవారం నాగ్‌పూర్‌ జిల్లాలో భారీవర్షాల వల్ల ముగ్గురు వ్యక్తులు మరణించారు. వరదనీరు ప్రవహిస్తున్న వంతెనను దాటుతుండగా వారు ప్రయాణిస్తున్న కారు కొట్టుకుపోవడంతో చాలామంది గల్లంతయ్యారు.ముంబై, థానే, రాయ్‌గఢ్‌, పాల్‌ఘర్‌లోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారత వాతావరణశాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.మహారాష్ట్ర వర్షాల బీభత్సం మధ్య మృతుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్రలో 83,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని మూడు నదులు వరద హెచ్చరిక స్థాయిలను మించి ప్రవహిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img