Friday, April 19, 2024
Friday, April 19, 2024

మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ రగడ

ముంబై : ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎగతాళి చేశారంటూ మహారాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం బీజేపీ రగడ చేసింది. దానితో సభలో వాయిదాలపర్వం కొనసాగింది. శివసేన ఎమ్మెల్యే భాస్కర్‌ జాదవ్‌ కొన్ని సంజ్ఞలు చేస్తూ రాష్ట్ర శాసనసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎగతాళి చేశారని బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ బుధవారం ఆరోపించారు. దీంతో విపక్ష సభ్యుల నుంచి తీవ్ర అభ్యంతరం రావడంతో సభా కార్యలాపాలు నిలిచిపోయాయి. అయితే రెండు వాయిదాల తర్వాత సభ తిరిగి సమావేశమైనప్పుడు జాదవ్‌ క్షమాపణ చెప్పాడు. చేతి సంజ్ఞలు చేయడం తన సహజమైన మాటల విధానమని, ప్రధానికి వ్యతిరేకంగా తాను ఎలాంటి అన్‌పార్లమెంటరీ పదాన్ని ఉపయోగించలేదని జాదవ్‌ అన్నారు. విద్యుత్‌ సమస్యలపై చర్చకు నోటీసు అందజేస్తున్నప్పుడు, ఫడ్నవిస్‌ ఆరోపించినట్లుగా జాదవ్‌ ఈ విధంగా చేశారు. సభలో బీజేపీ ఎమ్మెల్యే సుధీర్‌ ముంగంటివార్‌ మాట్లాడుతూ రాష్ట్ర రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి నితిన్‌ రౌత్‌ 100 యూనిట్ల వరకు వినియోగదారులకు విద్యుత్‌ టారిఫ్‌ను మాఫీ చేస్తానని ఇచ్చిన హామీపై ఎందుకు వెనక్కి తగ్గారో తెలుసుకోవాలన్నారు. కాగా టారిఫ్‌ను రద్దు చేసే అంశాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పానని రౌత్‌ గుర్తు చేశారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ కూడా రైతులకు కొన్ని వాగ్దానాలు చేశారని, కానీ వాటిని నెరవేర్చలేదని విద్యుత్‌ మంత్రి అన్నారు. ఈ సమయంలో జాదవ్‌ కొన్ని సంజ్ఞలు చేస్తూ నరేంద్ర మోదీని (2014లో ప్రధాని అభ్యర్థిగా మోదీ చేశారని తర్వాత ఆయన చెప్పాడు) అనుకరించారు. దీంతో ఫడ్నవిస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రధానిపై జాదవ్‌ చేసిన వ్యాఖ్యలను సహించబోమని అన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌తో కలిసి జాదవ్‌ ప్రధానిని అవమానించారని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలు లేచి జాదవ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జాదవ్‌ ఏమైనా అన్‌పార్లమెంటరీ వ్యాఖ్య చేశారా అన్నది పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ తెలిపారు. శాసనసభలో అన్ని పార్టీల నేతలను గౌరవించాలని జలవనరుల శాఖ మంత్రి జయంత్‌ పాటిల్‌ (ఎన్‌సీపీ), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరబ్‌ (శివసేన) అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img