Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మహిళలకు ప్రత్యేక మేనిఫెస్టో : ప్రియాంక

లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించనున్నట్టు ఆ పార్టీ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. అధికారంలోకి వస్తే ఉచిత సిలెండర్‌, ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం కల్పిస్తామని ఆమె చెప్పారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మహిళలకు 40 శాతం స్థానాలు కేటాయిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ యూపీ ఇన్‌చార్జి కూడా అయిన ప్రియాంక తెలిపారు. దాదాపుగా జనాభాలో సగం మహిళలే ఉన్నారని, అధికారంలో పూర్తిస్థాయి భాగస్వామి అయ్యే అవకాశం వారికే ఉందని ఆమె పేర్కొన్నారు. ‘ప్రియమైన ఉత్తరప్రదేశ్‌ చెల్లెళ్లలారా.. మీ దైనందిన జీవితమంతా ఇబ్బందులే. నాకు తెలుసు. అందుకే కాంగ్రెస్‌ పార్టీ మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టో తీసుకురాబోతోంది’ అని వాద్రా ట్వీట్‌ చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో తెలిపేలా ఉన్న చిత్రాన్ని ట్వీట్‌కు జతచేశారు. అంతేకాకుండా ఇతర హామీల్లో భాగంగా అశా కార్యకర్తలకు రూ.10వేల జీతం, రిజర్వేషన్లలో ఉండే అవకాశాన్ని బట్టి 40శాతం మహిళల నియామకాలు, వితంతు పింఛన్‌ రూ.1000, రాష్ట్రవ్యాప్తంగా 75 నైపుణ్య పాఠశాలలను నెలకొల్పడం వంటివి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ ప్రతి మహిళను కలుస్తున్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 12వ తరగతి పాస్‌ అయిన ప్రతి ఒక్క విద్యార్థినికి స్మార్ట్‌ఫోన్‌, డిగ్రీ పాస్‌ అయిన ప్రతి విద్యార్థినికీ ఎలక్ట్రికల్‌ స్కూటర్‌ను అందజేస్తామని గతనెలలో ఆమె హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img