Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

మాజీ ఎమ్మెల్యేలకు ఒక్క టర్మ్‌ పెన్షన్‌: మాన్‌

చండీగఢ్‌: పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్‌ మాన్‌ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారం చేపట్టిన నాటి నుంచి ఉద్యోగాల భర్తీ వంటి కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యేలకు ఒక టర్మ్‌(ఐదేళ్లు) మాత్రమే పెన్షన్‌ సదుపాయం కల్పిస్తామని శుక్రవారం స్పష్టంచేశారు. ‘పంజాబ్‌లోని మాజీ ఎమ్మెల్యేలకు ఇక నుంచి ఒక టర్మ్‌ మాత్రమే పెన్షన్‌ ఇస్తాం. రెండుసార్లు గెలిచినా..ఐదుసార్లు గెలిచినా..పదిసార్లు గెలిచినా ఇదే విధానం అమలు చేస్తాం’ అని మాన్‌ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ చాలామంది ఎంపీలు పెన్షన్‌ తీసుకుంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేల పెన్షన్‌ నుంచి మిగిలిన నిధులను ప్రజల సంక్షేమం కోసం వినియోగిస్తామని మాన్‌ వివరించారు. ‘ఎమ్మెల్యేలు సహా మన రాజకీయ నాయకులు చేతులు జోడిరచి మిమ్ములను ఓట్లు అడుగుతారు. మీకే సేవ చేయడానికి ఒక్క అవకాశం కోరతారు’ అని ప్రజలనుద్దేశించి మాన్‌ వ్యాఖ్యానించారు. ‘కానీ మీరు ఆశ్చర్యపడే అంశమేమంటే..ఎమ్మెల్యేలు రెండుసార్లు, మూడుసార్లు, నాలుగుసార్లు గెలుస్తారు. మళ్లీ ఎన్నికల్లో ఓటమి చెందేంత వరకూ లేదా పార్టీలు టికెట్‌ నిరాకరించేంత వరకూ పదవుల్లో ఉంటారు. ఆ తర్వాత నుంచి నెలకు లక్షల రూపాయల పెన్షన్‌ తీసుకుంటున్నారు’ అని వెల్లడిరచారు. కొంతమంది రూ.3.50 లక్షలు, మరికొందరు రూ.4.50 లక్షలు, ఇంకొందరు రూ.5.25 లక్షలు పెన్షన్‌ పొందుతున్నారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై కోట్లాది రూపాయల భారం పడుతుందని మాన్‌ వివరించారు. దీనికితోడు కుటుంబ పెన్షన్‌ పొందుతున్నారని తెలిపారు. ఇక నుంచి మాజీ ఎమ్మెల్యేలకు ఒక్క టర్మ్‌ మాత్రమే పెన్షన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మాన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img