Friday, April 19, 2024
Friday, April 19, 2024

మార్చిలో భారీగా పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

రికార్డు స్థాయిలో రూ.1.42 లక్షల కోట్ల ఆదాయం
న్యూదిల్లీ: గతంలో ఎన్నడూ లేనంతగా మార్చిలో స్థూల జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో 1.42 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది(2022) జనవరిలో వసూలు చేసిన రూ. 1,40,986 కోట్ల రికార్డును అధిగమించాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గత(2021-22) ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్‌టీ సేకరణ రూ. 1.38 లక్షల కోట్లుగా ఉంది. ఒమిక్రాన్‌ నేపథ్యం నుంచి ఆర్థికవ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో మార్చిలో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1.42 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడిరచింది. ఈ సంవత్సరం మార్చి నెల ఆదాయాలు గతేడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్‌టీ ఆదాయాల కంటే 15 శాతం ఎక్కువ. అంతేకాకుండా. 2020 మార్చిలో సమకూరిన జీఎస్‌టీ రాబడి కంటే 46 శాతం ఎక్కువ అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఈ ఏడాది మార్చి నెలలో సేకరించిన స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ. 1,42,095 కోట్లు. ఇందులో జీఎస్‌టీ రూ. 25,830 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 32,378 కోట్లు, ఐజీఎస్‌టీ రూ. 74,470 కోట్లు(రూ. 39,131 కోట్లు సహా వస్తువుల దిగుమతిపై వసూలైంది) రూ.9,417 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 981 కోట్లు కలిపి). ‘ఈ ఏడాది మార్చి2లో స్థూల జీఎస్‌టీ వసూళ్లు, జనవరి 2022 లో వసూలు చేసిన రూ. 1,40,986 కోట్లతో ఆల్‌ టైమ్‌ హై బ్రీచింగ్‌ రికార్డ్‌గా ఉంది’ అని ఫిన్‌మిన్‌ పేర్కొంది. కిందటి(2021-22) ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.38 లక్షల కోట్లు. మొదటి, రెండవ, మూడో త్రైమాసికాల్లో వాటి సగటు నెలవారీ వసూళ్లు రూ. 1.10 లక్షల కోట్లు, రూ.1.15 లక్షల కోట్లు, రూ. 1.30 లక్షల కోట్లుగా ఉంది. ఆర్థిక పునరుద్ధరణ, ఎగవేత నిరోధక కార్యకలాపాలు, ప్రత్యేకించి నకిలీ బిల్లర్లపై చర్యలు అధిక జీఎస్టీ వసూళ్లకు దోహదం చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇన్‌వర్టెడ్‌ డ్యూటీ స్ట్రక్చర్‌ను సరిచేయడానికి కౌన్సిల్‌ చేపట్టిన వివిధ రేట్ల హేతుబద్ధీకరణ చర్యల వల్ల కూడా ఆదాయం మెరుగుపడిరదని అభ్రిపాయపడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img