Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మీడియాను బెదిరించే ప్రయత్నాలు


దైనిక్‌ భాస్కర్‌’పై ఐటీ దాడులపై కేజ్రీవాల్‌ ఖండన
పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న దైనిక్‌ భాస్కర్‌ గ్రూప్‌ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులను ఢల్లీి ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఖండిరచారు. మీడియాను బెదిరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గురువారం ఉదయం దేశవ్యాప్తంగా ఉన్న పలు కార్యాలయాల్లో సోదాలు నిర్విహించారు. మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, న్యూఢల్లీిలోని పలు కార్యాలయాల్లో సోదాలు జరిపారు. దీనిపై కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌లో ఆదాయపు పన్ను శాఖ నిర్వహించిన దాడులు మీడియాను బెదిరించే ప్రయత్నాలని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వదిలిపెట్టబోమనే సందేశాన్ని ఇవ్వాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇటువంటి ఆలోచనా ధోరణి చాలా ప్రమాదకరమని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళమెత్తాలన్నారు. ఈ దాడులను వెంటనే ఆపాలని, స్వేచ్ఛగా పని చేసుకోవడానికి మీడియాకు అవకాశం ఇవ్వాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img