Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

సీజేఐ రమణ
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల ప్రకారం 2027లో దేశానికి తొలి మహిళా సీజేఐ రాబోతున్నారని, ఆమె కర్ణాటక జడ్జిగా ఉన్న నాగరత్నే కావచ్చని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి నియామకాలపై అధికారిక ప్రకటన కంటే ముందే వార్తలు రావడం ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. జడ్జీల నియామక ప్రక్రియకు ఓ పవిత్రత, హుందాతనం ఉంటాయి.బాధ్యతారహిత రిపోర్ట్‌ల కారణంగా అర్హులైన అభ్యర్థులకు పదవులు దక్కని ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిపై చాలా అసంతృప్తిగా ఉన్నట్లు చెప్పారు. అలాంటి నియామకాలపై రిపోర్ట్‌ చేసేటప్పుడు మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img