Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మీరేం చేశారో చెప్పండి

మోదీపై రాహుల్‌ ఆగ్రహం
న్యూదిల్లీ : పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ను దుయ్యబడుతూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రసంగంపై ఆ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష పార్టీపై ఆరోపణలు చేయొచ్చు కానీ.. తన పని తాను కూడా చేయాలని మోదీని ఎద్దేవా చేశారు. ామీరు కాంగ్రెస్‌, నెహ్రూలపై ఆరోపణలు చేయాలనుకుంటే.. ఆహ్వానిస్తాం. కానీ ముందు మీ కర్తవ్యాన్ని సరిగా నిర్వర్తించండి్ణ అని ఘాటుగా సమాధానమిచ్చారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు… కాంగ్రెస్‌ లక్ష్యంగా మోదీ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అటు లోక్‌సభలోనూ, ఇటు రాజ్యసభలోనూ రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిస్తూ.. వంశపారంపర్య పార్టీలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పుగా మోదీ ఎదురుదాడి చేశారు. నెహ్రూ-గాంధీ కుటుంబాలపై విమర్శలు సంధించారు. కాంగ్రెస్‌ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్‌గా అభివర్ణించారు. కాంగ్రెస్‌ అర్బన్‌ నక్సల్స్‌ మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నదని ఆరోపించారు. దీనిపై స్పందించి రాహుల్‌గాంధీ…కాంగ్రెస్‌ వాస్తవాలు మాట్లాడుతుండటంతో మోదీ భయపడ్డారని అన్నారు. ామా ముత్తాత నెహ్రూ ఈ దేశానికి సేవ చేశారు. తన జీవితాన్ని ఈ దేశానికే అంకితం చేశారు. కాబట్టి నా ముత్తాత గురించి ఎవరూ సర్టిఫికెట్‌ ఇవ్వనక్కర్లేదు్ణ అని రాహుల్‌ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img