Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలి

బీహార్‌ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్య
పాట్నా: బీహార్‌ బీజేపీ ఎమ్మెల్యే హరి భూషన్‌ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ముస్లింలకు ఓటు హక్కు తొలగించాలని డిమాండు చేశారు. 1947లో మతాల పేరుతో దేశం విడిపోయింది. వారు ఆ దేశానికి వెళ్లిపోవాలి. ఒక వేళ వారు ఇక్కడే ఉంటే.. ప్రభుత్వం వారికి కల్పించిన ఓటు హక్కును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నానని చెప్పారు. వారు (ముస్లింలు) భారత దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండవచ్చన్నారు. ముస్లింలకు జనాభా ప్రాతిపదికన హక్కులు కల్పించాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్తరుల్‌ ఇమాన్‌ చేసిన వ్యాఖ్యలపై హరి భూషన్‌ స్పందించారు. దేశంలో ముస్లింలు ఐఎస్‌ఐఎస్‌ అజెండాను అమలు చేస్తున్నారని, భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలని చూస్తున్నారని విమర్శించారు. వారికి ఓటు హక్కు తొలగించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img