Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మెరుగైన సౌకర్యాలతో హజ్‌2022

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : కేంద్ర మంత్రి నఖ్వీ

ముంబై : ముస్లింలు పవిత్రంగా భావించే హజ్‌2022 యాత్రకు వెళ్లాలని భావించే వారి కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. దక్షిణ ముంబైలోని హజ్‌హౌస్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ ఈ మేరకు ప్రకటన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…తీర్థయాత్ర చేయాలని భావిస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. 2022 సంవత్సరానికి సంబంధించి హజ్‌ యాత్ర దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. జనవరి 31, 2022 వరకూ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు పేర్కొన్నారు. హజ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. హజ్‌ యాత్రికు వెళ్లే భారతీయులు గతంలో విదేశీ కరెన్సీలో అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేవారని అయితే ఈ ఏడాది పూర్తిగా స్వదేశీ ఉత్పత్తులతో అక్కడికి వెళ్తారని తెలిపారు. ప్రతి ఏటా భారత్‌ 2 లక్షల మంది యాత్రికులను హజ్‌ సందర్శనకు పంపుతోందని వెల్లడిరచారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ఏర్పాట్లతో యాత్రికుల కోట్లాది రూపాయల ఆదా అవుతోందని వివరించారు. దరఖాస్తుల అనంతరం యాత్రికుల ఎంపిక ప్రక్రియ మాత్రం సౌదీ, భారత్‌ల కరోనా నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు. హజ్‌`2022 యాత్రకు సంబంధించి ఎంబార్కేషన్‌ పాయింట్లను అహ్మదాబాద్‌, బెంగళూరు, కొచ్చిన్‌, ఢల్లీి, గౌహతి, హైదరాబాద్‌, కోల్‌కతా, లక్నో, ముంబై శ్రీనగర్‌లలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక మహిళలు కూడా సహచరుడు లేకుండానే యాత్ర కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img