Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మోదీ సాబ్‌ ! ఇవేం ఉద్యోగాలు !

ప్రధాని ప్రకటనపై అసదుద్దీన్‌ ఒవైసీ
ప్రధాని నరేంద్ర మోదీ ఉద్యోగాల భర్తీపై చేసిన ప్రకటనపై హైదరాబాద్‌ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ప్రధాని మోదీ కేవలం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడంపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత గడిచిన 8 ఏళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 16 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందన్నారు. అలాంటిది ఇప్పుడు కేవలం పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేపడతామని ప్రకటించడం సరికాదన్నారు. ఇప్పటివరకే కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రధాని మోదీ ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేవలం 10 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం 55 లక్షల పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కానీ ప్రధాని మోదీ కేవలం పది లక్షల ఉద్యోగాలే ప్రకటించారని ఇది సరికాదన్నారు అసదుద్దీన్‌ ఒవైసీ. నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని ఉంటే కేంద్ర ప్రభుత్వం కోట్ల ఉద్యోగాలను ఇప్పటికే చేసేదని అభిప్రాయపడ్డారు. హెచ్‌ఆర్‌డీ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన అనంతరం ప్రధాని మోదీ ఉద్యోగాల భర్తీకి ఆదేశించారని పీఎంఓ నేటి ఉదయం ట్వీట్‌ చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపు కోట్ల మిలియన్ల ఉద్యోగాలు భర్తీ చేయలేదని ప్రతిపక్షాలు తరచుగా విమర్శిస్తుంటాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రానికి నిధులు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని విమర్శించింది. ప్రతి రాష్ట్రంలోనూ ఉద్యోగాల భర్తీపై డిమాండ్లు రావడం, దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో నిరుద్యోగిత ఒకటి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img