Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యువభారత్‌ దారి చూపుతోంది

న్యూదిల్లీ: దేశంలో కరోనా కట్టడికి వాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. 15-18 ఏళ్ల మధ్య వయస్సున్న 50% మంది యువకులు మొదటి డోస్‌ టీకా తీసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్‌ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ మన్సుఖ్‌ మాండవియా చేసిన ట్వీట్‌కు ప్రధాని మోదీ రీట్వీట్‌ చేశారు. ‘యువత, యువ భారతదేశం మార్గాన్ని చూపుతోంది! ఇది ప్రోత్సాహకరమైన వార్త. మనం ఇదే వేగాన్ని కొనసాగిద్దాం. టీకాలు వేయడం, తీసుకోవడం, అన్ని కరోనా సంబంధిత ప్రోటోకాల్‌లను పాటించడం చాలా ముఖ్యం. మనమందరం కలిసి ఈ మహమ్మారిపై పోరాడదాం’ అంటూ ప్రధాని ట్వీట్‌ చేశారు. అంతకుముందు మన్సుఖ్‌ మాండవియా ట్వీట్‌ చేస్తూ భారత్‌ కోవిడ్‌పై చేస్తున్న పోరాటంలో కీలక రోజు… 15-18 ఏళ్ల మధ్య ఉన్న మన యువకులలో 50% కంటే ఎక్కువ మంది కరోనా వాక్సిన్‌ మొదటి డోసు పొందారని ట్వీట్‌ చేశారు. టీకా పట్ల మీ ఉత్సాహం ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తోందంటూ ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img