Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యూపీలో భారీ వర్షాలు.. 11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 11 మంది మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. లక్నో, నోయిడా, కాన్పూర్‌, ఆగ్రా, ఫిరోజాబాద్‌ తదితర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 17 జిల్లాలోని 900 గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చ రికలు జారీ చేశారు. భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా మారాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పొలాలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img