Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

యూపీ బార్‌ కౌన్సిల్‌పై సుప్రీం మండిపాటు

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రిబ్యునల్‌ అండ్‌ వర్క్‌మెన్‌ కాంపెన్సేషన్‌ చట్టం కింద నకిలీ క్లెయిమ్‌లు దాఖలు చేస్తున్న న్యాయవాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. నకిలీ క్లెయిమ్‌ల కారణంగా బీమా కంపెనీలకు కోట్లాదిరూపాయల నష్టం వాటిల్లుతోందని స్పష్టంచేసింది. ఇది చాలా తీవ్రమైన, దురదృష్టకర అంశమని వ్యాఖ్యానించింది. నకిలీ క్లెయిమ్‌లు దాఖలు చేస్తున్న తమ న్యాయవాదులకు కనీస సూచనలు కూడా యూపీ బార్‌ కౌన్సిల్‌ చేయడం లేదని మండిపడిరది. యూపీ బార్‌ కౌన్సిల్‌ బాధ్యతయుతంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని బార్‌కౌన్సిల్‌ చైర్మన్‌, సీనియర్‌ న్యాయవాది మానన్‌ కుమార్‌ మిశ్రాను ఆదేశించింది. నకిలీ క్లెయిమ్‌లు దాఖలు చేయడం ద్వారా అనైతిక చర్యలకు పాల్పడుతున్న న్యాయవాదులపై చర్యలు తీసుకోవడం బార్‌కౌన్సిల్‌ బాధ్యతని ధర్మాసనం స్పష్టంచేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img