Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాజీనామా చేస్తాన‌న్న వారిపై ప‌రువున‌ష్టం దావా.. డీకే శివ‌కుమార్

  • పీసీసీ పదవికి తాను రాజీనామా చేయడంలేదని డీకే శివకుమార్ వెల్లడించారు. ఇటువంటి వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్న వారిపై ప‌రువున‌ష్టం దావా వేస్తాన‌ని ఆయ‌న తీవ్రంగా హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీ తనకు తల్లి లాంటిదని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో అడుగడుగునా తన పాత్ర ఉందని ఉద్ఘాటించారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఒకెత్తయితే, ఆ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరన్నది తేల్చడం మరో ఎత్తు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఈ నెల 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగాౌ నూతన సీఎం ఎవరన్నదానిపై ఇప్పటికీ సస్పెన్స్ వీడలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం హస్తినకు చేరింది. కాగా, కర్ణాటక సీఎం ఎంపిక వ్యవహారం నేపథ్యంలో డీకే శివకుమార్ కాసేపట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. అధిష్ఠానంతో మాట్లాడేందుకు ఢిల్లీ వచ్చిన కర్ణాటక కాంగ్రెస్ రథ సారథి డీకే శివకుమార్ తాజా ఊహాగానాలపై స్పందించారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img