Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రానున్నది అమృత్‌ కాలం: అమిత్‌షా

న్యూదిల్లీ: ప్రజల సంక్షేమం కోసం పార్టీలకతీతంగా అందరూ కలిసి పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం పిలుపునిచ్చారు. అలాగైతే రానున్న 25 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్‌ అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవిస్తుందని చెప్పారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అమృత్‌ సమాగమ్‌లో అమిత్‌షా ప్రసంగించారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన నాటి నుంచి 100వ స్వాతంత్య్ర దినోత్సవం అంటే రానున్న 25 ఏళ్లు దేశాభివృద్ధికి అత్యంత కీలకమని, ఈ సమయం అమృత్‌ కాలంగా మారుతుందని ప్రధాని మోదీ ఇప్పటికే చెప్పారని అమిత్‌షా గుర్తుచేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో ప్రజల భాగస్వామ్యం ఎలా పెంచాలి? దేశ సంక్షేమం కోసం ఎలా పనిచేయాలి? ప్రతిగ్రామం, పాఠశాల, యువతను భాగస్వామ్యం ఎలా చేయాలనే అంశాలపై రానున్న 25 ఏళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ‘25 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రిగా ఎవరుంటారో, ఏ పార్టీ అధికారంలో ఉంటుందో మాకు తెలియదు. ఎవరు అధికారంలో ఉన్నా దేశం మాత్రం అలాగే ఉంటుంది. అందుకే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మిషన్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలి’ అని అమిత్‌షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img