Friday, April 19, 2024
Friday, April 19, 2024

రామేశ్వరంలో జాలర్ల ఆందోళన

రామేశ్వరం : శ్రీలంక నావికాదళం అరెస్టు చేసిన 55మంది భారత మత్స్యకారులను తక్షణమే విడుదల చేయించాలని డిమాండ్‌ చేస్తూ మత్స్యకార సంఘాలు సోమవారం ఆందోళనకు దిగాయి. 200మందికి పైగా మత్స్యకారులు ధర్నా చేశారు. అరెస్టులకు నిరసనగా ఆదివారం నుంచి మత్స్యకారులు నిరవధిక సమ్మెకు దిగారు. అరెస్టు చేసిన మత్స్యకారులను, స్వాధీనం చేసుకున్న పడవలను శ్రీలంక అధికారులు వెంటనే విడిపించాలని డిమాండ్‌ చేశారు. మత్స్యకార సంఘం నాయకుడు శేషురాజ మాట్లాడుతూ ఇక్కడికి సమీపంలోని తంగచిమడంలో బుధవారం ఒకరోజు నిరవధిక దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారులను శ్రీలంక ప్రభుత్వం విడుదల చేయకపోతే జనవరి ఒకటిన రైల్‌రోకో చేస్తామని హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన 55 మంది మత్స్యకారులను జాఫ్నా కోర్టు డిసెంబరు 31 వరకు రిమాండ్‌ విధించింది. వారందరినీ జాఫ్నాలో జైలుకు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img