Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రపతి ఎన్నికకు నేడే షెడ్యూల్‌..!

భారత రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది.ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేయనుంది.ఈ మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడిరచారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జూలై24తో ముగియనుంది. ఆలోపు తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 62 ప్రకారం ఆనాటి కల్లా కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పార్లమెంటు ఉభయసభలకు ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, అన్ని రాష్ట్రాలు, ఢల్లీి, పాండిచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎన్నికైన చట్టసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ రాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. 776 పార్లమెంటేరియన్లు, 4,120 మంది లెజిస్లేటర్లు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టోరల్‌ కాలేజీ బలం 10,98,903 ఓట్లుగా ఉంటుంది. లోక్‌ సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలిలోని నామినేటెడ్‌ సభ్యులు ఎలక్టోరల్‌ కాలేజీలో ఉండరు. వీరికి ఓటు ఉండదు.బ్యాలెట్‌ పేపర్‌ విధానంలో ఓటింగ్‌ జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే పెన్నుతో ఓటు వేస్తే అది చెల్లుబాటు కాదు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు విప్‌ జారీ చేయకూడదు. ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img