Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కరెన్సీ నోట్లపై ఫోటోల మార్పు ప్రతిపాదన లేదు :ఆర్‌బీఐ

దేశంలోని కొత్త కరెన్సీ నోట్ల పై మహాత్మాగాంధీ ఫోటోల స్థానే పలువురు ప్రముఖులు ఫోటోలను ముద్రించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) భావిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు సంచనలం సృష్టించాయి. అయితే ఈ వార్తలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సోమవారంనాడు తోసిపుచ్చింది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదని ఒక ప్రకటనలో పేర్కొంది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని తెలిపింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ, బ్యాంకునోట్లలో మార్పు ఉండదని వివరణ ఇచ్చింది. దేశంలోని కొత్త కరెన్సీ నోట్లపై విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, మిసైల్‌ మ్యాన్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం ఫోటోలను కూడా ముద్రించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ భావిస్తోందని, కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్బీఐ సంయుక్తంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వార్తలు వచ్చాయి. ఫోటోల డిజైన్లను కేంద్రం ఆమోదించినట్టు ఆ వార్తలు పేర్కొన్నారు. గాంధీ కొత్త ఫొటోలతో పాటు ఠాగూర్‌, కలాం ఫొటోలను ఐఐటీ ఢల్లీి రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ దిలీప్‌ షహానీకి పంపినట్టు ఆ కథనాలు పేర్కొన్నారు. కాగా, ఈ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆర్‌బీఐ తాజాగా వివరణ ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img