Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రిషభ్‌ పంత్‌కు ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రగాయాలు..

పంత్‌ చికిత్సకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి వెల్లడి
టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతను ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో వాహనంలో మంటలు చెలరేగాయి. ఉత్తరాఖండ్‌ నుంచి ఢల్లీి వెళ్తుండగా రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటన జరిగిన సమయంలో తన మెర్సిడెస్‌ కారును పంతే నడుపుతున్నట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పంత్‌ తల, పాదాలతో పాటు వీపు బాగంలో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. న్యూఇయర్‌కు తల్లికి సప్రైజ్‌ ఇద్దామని సమాచారం ఇవ్వకుండా రిషభ్‌ పంత్‌ వచ్చినట్లు తెలుస్తోంది. రిషభ్‌ పంత్‌ తలకు గాయాలు, మోకాలి ఫ్రాక్చర్‌, వీపుపై కాలిన గాయాలతో పంత్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి స్పందించారు. రిషబ్‌ పంత్‌ చికిత్సకు అయ్యే ఖర్చును తమ ప్రభుత్వం భరిస్తుందని వెల్లడిరచారు. పంత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. కాగా, పంత్‌ ప్రస్తుతం డెహ్రాడూన్‌ లోని మ్యాక్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్‌కు వైద్యసాయం అందిస్తున్న డాక్టర్‌ ఆశిష్‌ యాజ్ఞిక్‌ స్పందిస్తూ, పంత్‌ కు ప్రాణాపాయం లేదని తెలిపారు. పంత్‌ కు ఓ మోస్తరు గాయాలు తగిలాయని వివరించారు. . తాము పంత్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని, చికిత్స అందిస్తున్న వైద్యులతోనూ సంప్రదింపులు జరుపుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడిరచారు. పంత్‌ కోలుకునే క్రమంలో అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img