Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రూ.200 కోట్ల నల్లడబ్బు స్వాధీనం

న్యూదిల్లీ : సిమెంట్‌, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారానికి సంబంధించి కోల్‌కతాకు చెందిన ఓ గ్రూప్‌ నుంచి సుమారు లెక్కల్లోకి రాని రూ.200 కోట్లను కనుగొన్నట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. నవంబర్‌ 16న దిల్లీ, మేఘాలయ, అసోం, కోల్‌కతాలోని దాదాపు 24 ప్రాంతాల్లో సోదాలు జరిగాయని పేర్కొంది. రూ.1.30 కోట్లు డబ్బు, ఆరు బ్యాంక్‌ లాకర్స్‌ దాడుల సమయంలో బయటపడ్డట్టు బోర్డు తెలిపింది. ‘మొత్తంగా రూ.200 కోట్లు లెక్కల్లోకి రాని డబ్బు గురించి సోదాలు నిర్వహించాం’ అని పేర్కొంది. తాము స్వాధీనం చేసుకున్న కాగితాలను పరిశీలిస్తే ఆదాయపన్ను ఎగవేతకు మార్గాలు వెదికినట్టు కనిపిస్తోందని, ఇందుకోసం ఉత్పత్తిని తగ్గించడం, లెక్కల్లోకి రాని ఇన్వాయస్‌లు లేకుండా, బోగస్‌ పార్టీలను చూపిస్తూ ద్రవోల్బణాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలకు చేపట్టినట్టి గుర్తించామని బోర్డు తెలిపింది. అలాగే రశీదులు లేకుండా ఫ్లాట్లు అమ్మడం బయటపడిరదని వివరించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img