Friday, April 19, 2024
Friday, April 19, 2024

రూ.38వేల కోట్ల రక్షణ ఎగుమతులు

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌
న్యూదిల్లీ : గడచిన ఏడేళ్లలో రూ.38 వేల కోట్లకు పైగా విలువైన రక్షణ పరికరాలను భారత్‌ ఎగుమతి చేసినట్లు కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ శనివారం చెప్పారు. భారతదేశం త్వరలోనే అతిపెద్ద ఎగుమతి దేశంగా ఆవిర్భవిస్తుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ పరిశ్రమ ద్వారా రూ.85 వేల కోట్ల ఎగుమతులు చేయాలని అంచనా వేశామని, ఇందులో ప్రైవేట్‌రంగం భాగస్వామ్యం రూ.18 వేల కోట్లకు పెరిగిందని రాజ్‌నాథ్‌ చెప్పారు. సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌కు సంబంధించి ఎంఎస్‌ఎంఈ సదస్సులో రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రసంగించారు. దేశ భద్రత పటిష్టతకు దోహదపడేలా పరిశోధన, అభివృద్ధి రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఎంఎస్‌ఎంఈలకు రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు. ‘మీరు కొత్త సాంకేతిక పరిజ్ఞానం, సరికొత్త ఉత్పత్తులు తీసుకురండి. మీరు చిన్నవాళ్లుగా భావించుకోవద్దు. అలాగైతే మీరు ఎప్పటికీ గొప్ప అన్వేషణలు చేయలేరు’ అని రాజ్‌నాథ్‌ సూచించారు. ప్రభుత్వ చొరవ కారణంగా రక్షణరంగంలో 12 వేల ఎంఎస్‌ఎంఈలు చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img