Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రూ.500కు రూ.2,500.. ఏటీఎం ముందు భారీ క్యూ

విత్‌డ్రా చేయాలనుకున్న మొత్తానికి అయిదు రెట్లు ఎక్కువ నగదు వస్తుండటంతో మహారాష్ట్రలోని ఓ ఏటీఎం కేంద్రానికి వినియోగదారులు ఎగబడ్డారు. వివరాల్లోకి వెళితే, మహారాష్ట్రలో నాగ్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖపర్‌ కేడ పట్టణంలో ఒక వ్యక్తి బుధవారం ఏటీఎం సెంటర్‌ కు వెళ్లాడు. తనకు రూ.500 అవసరం ఉండడంతో అంతే మొత్తాన్ని సెలక్ట్‌ చేసుకున్నాడు. తీరా మెషిన్‌ నుంచి డబ్బు బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే రూ.2,500 ఉన్నాయి. రూ.500 నోటు ఒకదానికి బదులు ఐదు వచ్చాయి. ఎందుకు అలా జరిగిందో అతడికి అస్సలు అర్థం కాలేదు. తాను పొరపాటుగా సెలక్ట్‌ చేసుకున్నానా?, మరోసారి చెక్‌ చేద్దామని చెప్పి ఈ సారి కూడా రూ.500 సెలక్ట్‌ చేశాడు. చిత్రంగా మరోసారి రూ.2,500 అంటే రూ.500 నోట్లు ఐదు వచ్చాయి. ఈ విషయం ఒకరి నుంచి మరొకరికి ఆ పట్టణంలో వ్యాపించింది. భారీ క్యూతో ఏటీఎం ముందు అంతమంది గుమికూడడాన్ని చూసి ఎవరో ఒకరు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో పోలీసులు ఏటీఎం కేంద్రాన్ని మూసివేసి, బ్యాంకు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంతకీ అలా ఎందుకు జరిగిందంటే..? ఇందులో మానవ తప్పిదం కనిపిస్తోంది. మెషిన్‌ లో రూ.100 నోట్లను ఉంచే ట్రేలో రూ.500 నోట్లు పెట్టారు. దీంతో రూ.500 సెలక్ట్‌ చేసుకున్న వారికి రూ.100 నోట్లని భావించి 5 ఇస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img